నాంది ఫాండేషన్ 28 ఏళ్ల ప్రస్థానం.. ఆనంద్ మహీంద్రాకు చంద్రబాబు థ్యాంక్స్
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:53 PM
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాంది ఫౌండేషన్ 28 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్పందించిన ఆనంద్ మహీంద్రాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాంది ఫౌండేషన్ 28 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్పందించిన ఆనంద్ మహీంద్రాకు చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. 28 ఏళ్ల క్రితం 'నాంది' ప్రస్థానం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. దివంగత డాక్టర్ కే. అంజిరెడ్డితో కలిసి 28 ఏళ్ల క్రితం నాంది ఫౌండేషన్‌ను ప్రారంభించామని ప్రస్తావించారు. P4 మోడలే సుస్థిరాభివృద్ధికి మూలమని తెలిపారు.
అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ చర్యల ద్వారానే సాధ్యపడదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడిన P4 (Public-Private-People Partnership) మోడల్‌తోనే నిజమైన మార్పు సాధ్యమని ఉద్ఘాటించారు. గ్రామీణ రైతులు, ఆడపిల్లలు, యువతకు సాధికారత కల్పిస్తే సమృద్ధి సాధ్యమని అరకు కాఫీ, నన్హీ కలీ ప్రాజెక్టులు నిరూపించాయని తెలిపారు. అరకులో పర్యావరణానికి పునరుజ్జీవం పోస్తామని చెప్పుకొచ్చారు. పునరుత్పత్తి వ్యవసాయం ద్వారా అరకు రైతులకు జీవనోపాధితో పాటు ప్రకృతికి పూర్వవైభవం లభించిందని వెల్లడించారు.
లక్ష్యం 'జీరో పవర్టీ' పేదరికం అనేది కేవలం ఒక సంఖ్య కాదని, అవకాశాలు, గౌరవం లేకపోవడమే పేదరికమని సీఎం చెప్పుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు గణాంకాలు మనకు ప్రోత్సాహాన్నిస్తే, నాంది వంటి క్షేత్రస్థాయి ప్రాజెక్టులు జీరో పావర్టీ సాధనకు మూలాలు అవుతున్నాయని వివరించారు. కలలుగనే స్వేచ్ఛ అందరికీ దక్కాలని అన్నారు. ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పిస్తూ, పేదరిక రహిత భారత్ నిర్మాణానికి భాగస్వామ్యంతో ముందడుగు వేద్దామంటూ ఆనంద్ మహేంద్ర పోస్టును ట్యాగ్ చేస్తూ సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News