స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ
ABN , Publish Date - Nov 03 , 2026 | 08:26 PM
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) స్పష్టం చేశారు. ఏపీవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. మొత్తం 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద 40,679 మంది సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించామని వెల్లడించారు. ఈరోజు (మంగళవారం) అమరావతి వేదికగా మీడియాతో డీజీపీ మాట్లాడారు.
ప్రత్యేక నిఘా..
ఎన్నికల విధుల్లో వివిధ హోదాలకు చెందిన 38,348 మంది పోలీస్ సిబ్బంది, 111 ఏపీ స్పెషల్ పోలీస్ ప్లటూన్లు పాల్గొన్నాయని డీజీపీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక -1,841, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు -2,645లను గుర్తించామని.. ఆయా కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. భద్రత కోసం 3,488 రూట్ మొబైల్స్, 931 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 412 చెక్‌పోస్టులు, 847 SST బృందాలు మోహరించాయని వెల్లడించారు. సీసీటీవీలు, బాడీ వార్న్ కెమెరాలు, 'సమర్థ్' (Samarth) యాప్ ద్వారా హెడ్‌క్వార్టర్స్ కమాండ్ కంట్రోల్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..
బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే 178 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని డీజీపీ చెప్పుకొచ్చారు. ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగించినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ
తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News