Share News

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ

ABN , Publish Date - Nov 03 , 2026 | 01:10 PM

మురసు తుఫాన్ ప్రభావంతో పలు రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. విజయవాడ, ఒంగోలు, గూడూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ
Train Cancellation

విజయవాడ, నవంబర్ 3: ఏపీపై మురసు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటడంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మురసు తుఫాన్ ప్రభావంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ, ఒంగోలు, గూడూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కరవాడి రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి. తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ విధించింది. మొత్తం 29 రైళ్లపై తుఫాన్ ప్రభావం ఉండటంతో... 19 అప్, 10 డౌన్ రైళ్లపై అధికారులు నియంత్రణ విధించారు.


కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని దారి మళ్లించడంతో పాటు రీషెడ్యూల్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రైళ్ల నియంత్రణ కొనసాగుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణానికి ముందు రైళ్ల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. రైళ్ల సమాచారం కోసం NTES యాప్‌ను పరిశీలించాలని తెలిపారు. ప్రయాణికులు అధికారిక రైల్వే ప్రకటనలను మాత్రమే అనుసరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

కాకినాడ జిల్లాలో కూటమి హవా.. 1వ రౌండ్ పూర్తయ్యేసరికి 4 స్థానాల్లో విజయం

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. వైసీపీ ఎంపీ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 01:21 PM