సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. వైసీపీ ఎంపీ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Nov 03 , 2026 | 11:57 AM
ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏపీ డీజీపీ, కమిషనర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చి విచారించాలంటూ వైసీపీ ఎంపీ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ, నవంబర్ 3: ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏపీ డీజీపీ, కమిషనర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చి విచారించాలంటూ వైసీపీ ఎంపీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే సాయికృష్ణ కేసును ఇప్పటికే సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది.
ఇవి కూడా చదవండి..
మురసు తుఫాన్.. ప్రాణ నష్ట నివారణే తొలి ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
పిఠాపురం పురపాలకలో జనసేన హవా.. ఏడు వార్డుల ఫలితాల వెల్లడి
Read Latest AP News And Telugu News