Share News

పిఠాపురంలో జనసేన హవా.. ఏడు వార్డుల ఫలితాల వెల్లడి

ABN , Publish Date - Nov 03 , 2026 | 11:45 AM

పిఠాపురం పురపాలక సంఘం ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. మొత్తం 36 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఏడు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి.

పిఠాపురంలో జనసేన హవా.. ఏడు వార్డుల ఫలితాల వెల్లడి
Pithapuram Municipal Elections

పిఠాపురం, నవంబర్ 3: పిఠాపురం పురపాలక సంఘం ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. మొత్తం 36 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఏడు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో నాలుగు వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డులో గెలుపొందారు. 3వ వార్డులో జనసేన అభ్యర్థి బొజ్జ వెంకటేశ్వరరావు 702 ఓట్లతో విజయం సాధించారు. 5వ వార్డులో కొత్తపల్లి పద్మ 777 ఓట్లు, 6వ వార్డులో శ్రీలక్ష్మి శిరీష 461 ఓట్లు సాధించి జనసేన తరఫున గెలుపొందారు. 8వ వార్డులో కరణం రుద్రయ్య 850 ఓట్లతో విజయం సాధించారు.


2వ వార్డులో టీడీపీ అభ్యర్థి సోము దుర్గా కామేశ్వరి 603 ఓట్లతో గెలుపొందారు. 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిని వజ్రపు వెన్నెల 665 ఓట్లు సాధించి విజయం సాధించగా, 9వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి మోర్త చిన పండు 330 ఓట్లతో గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన ఏడు వార్డుల ఫలితాల్లో జనసేన నాలుగు స్థానాలను కైవసం చేసుకోగా, టీడీపీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

మద్యం స్కామ్ కేసులో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణ

మురసు తుఫాన్.. ప్రాణ నష్ట నివారణే తొలి ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 12:46 PM