Share News

కూటమి మేయర్ అభ్యర్థుల హవా..

ABN , Publish Date - Nov 03 , 2026 | 11:06 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు తమ సత్తా చాటుతున్నాయి. పలు కార్పొరేషన్లలో 'కూటమి' మేయర్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కూటమి మేయర్ అభ్యర్థుల హవా..

అమరావతి, నవంబర్ 03: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు తమ సత్తా చాటుతున్నాయి. పలు కార్పొరేషన్లలో 'కూటమి' మేయర్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ (టీడీపీ), ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు (జనసేన) ముందంజలో ఉన్నారు. విశాఖపట్నంలో ముక్కా శ్రావణి (టీడీపీ), విజయనగరంలో అవనాపు భార్గవి (టీడీపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక చిత్తూరులో కటారి హేమలత (టీడీపీ), తిరుపతిలో జేబీ శ్రీనివాస్ (టీడీపీ) ముందంజలో దూసుకుపోతున్నారు.


కళ్యాణదుర్గంలో బోణీ చేసిన టీడీపీ అభ్యర్థులు..

ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీ బోణీ చేసింది. మూడు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి పి. వెంకటరమణ ఘన విజయం సాధించారు. 191 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఆయనకు 318 ఓట్లు రాగా.. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి 127 ఓట్లు వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మహాపాదయాత్ర సక్సెస్.. టీ బీజేపీ చీఫ్‌ను అభినందించిన అమిత్ షా

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

For More AP News and Telugu News

Updated Date - Nov 03 , 2026 | 11:23 AM