Share News

మహాపాదయాత్ర సక్సెస్.. టీ బీజేపీ చీఫ్‌ను అభినందించిన అమిత్ షా

ABN , Publish Date - Nov 03 , 2026 | 10:30 AM

హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సక్సెస్ అయిందని.. ఇలా పని చేస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

మహాపాదయాత్ర సక్సెస్.. టీ బీజేపీ చీఫ్‌ను అభినందించిన అమిత్ షా

హైదరాబాద్, నవంబర్ 03: నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సక్సెస్ అయిందని.. ఇలా పని చేస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ జిల్లా, డివిజన్ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిలతో మంత్రి అమిత్ షా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాపాదయాత్ర సక్సెస్ అయిన నేపథ్యంలో టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావును అభినందించారు. పాదయాత్రలో జన సందోహం చాలా బాగుందని అన్నారు. ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.


హైదరాబాద్‌లో సోమవారం (నవంబర్ 2వ తేదీ) లోక్‌తంత్ర బచావో - అరాచకత హటావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి -అరాచకత్వాన్ని అంతం చేయండి) పేరిట బీజేపీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర జరిగింది. ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర.. ఎంజే మార్కెట్ వరకు సాగింది. ఈ పాదయాత్రలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.


ఇండియా కూటమిపై మండిపడ్డారు. సర్‌పై చర్చకు రావాలని విపక్షాలకు అమిత్ షా సవాల్ విసిరారు. సర్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో విపక్షాలు చేపట్టిన ర్యాలీకి దీటుగా హైదరాబాద్ వేదికగా బీజేపీ ఈ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులతోపాటు ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ పాదయాత్ర సక్సెస్ కావడంతో టీ బీజేపీ చీఫ్‌ను కేంద్ర మంత్రి అమిత్ షా అభినందనలతో ముంచెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాతబస్తీలో యువకుడి హత్య.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

For More TG News and Telugu News

Updated Date - Nov 03 , 2026 | 10:49 AM