పాతబస్తీలో యువకుడి హత్య.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 08:33 AM
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాంచన్‌బాగ్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
హైదరాబాద్, నవంబర్ 03: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాంచన్‌బాగ్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున సయ్యద్ ఒమర్ అలియాస్ మషల్లా ఒమర్‌పై కొందరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఒమర్ పక్కనే ఉన్న సయ్యద్ అనే వ్యక్తి ఆ దాడిని అపేందుకు యత్నించాడు. అతడిపై కూడా సదరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఒమర్ అక్కడికక్కడే మృతి చెందగా.. సయ్యద్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం దాడి చేసిన వారు పరారయ్యారు.
స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి సయ్యద్‌ను తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. ఒమర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.
మృతుడు ఒమర్‌కు నేర చరిత్ర ఉందని పోలీసులకు స్థానికులు తెలిపారు. అమన్ ఖురేషి, అలీ భైసా ఈ హత్య చేశారని వారు ఆరోపించారు. ఒమర్‌పై బెదిరింపులు, బలవంతపు నగదు వసూళ్ల ఆరోపణలు ఉన్నాయని పోలీసులకు స్థానికులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
6, 7 తేదీల్లో చర్లపల్లి-చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లు
For More TG News and Telugu News