Share News

6, 7 తేదీల్లో చర్లపల్లి-చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Nov 03 , 2026 | 08:10 AM

పూజా ఫెస్టివల్‌ను పురస్కరించుకొని చర్లపల్లి-చెన్నై మార్గంలో రెండు ప్రత్యేకరైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

6, 7 తేదీల్లో చర్లపల్లి-చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లు
Cherlapalli Chennai Special Trains

హైదరాబాద్‌ సిటీ: పూజా ఫెస్టివల్‌ను పురస్కరించుకొని చర్లపల్లి-చెన్నై మార్గంలో రెండు ప్రత్యేకరైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. 6, 7 తేదీల్లో ఈ పండుగ ప్రత్యేకరైళ్లు ప్రయాణికులకు అందుబాట్‌లో ఉంటాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. 6వ తేదీ రాత్రి 9.30 గంటలకు చర్లపల్లి నుంచి (07059 నెంబర్‌), 7వ తేదీ మధ్యాహ్నం 12.40 గంటలకు చెన్నై నుంచి (07060నెంబర్‌) ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని పేర్కొన్నారు. ఈ రైళ్లు మార్గమధ్యంలో నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతాయని సీపీఆర్‌ఓ వెల్లడించారు.


city3.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

వీకెండ్‌ పార్టీ కేసులో.. 7కు చేరిన గంజాయి పాజిటివ్‌లు

అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 08:10 AM