Share News

వీకెండ్‌ పార్టీ కేసులో.. 7కు చేరిన గంజాయి పాజిటివ్‌లు

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:04 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామం పరిధిలోని ఎల్‌జీ ఫాంహౌస్‌లో నిర్వహించిన విద్యార్థుల వీకెండ్‌ పార్టీ కేసులో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏడుకు పెరిగిందని చేవెళ్ల సీఐ కట్టా నరేందర్‌రెడ్డి తెలిపారు.

వీకెండ్‌ పార్టీ కేసులో.. 7కు చేరిన గంజాయి పాజిటివ్‌లు
Chevella Weekend Party Case

చేవెళ్ల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామం పరిధిలోని ఎల్‌జీ ఫాంహౌస్‌లో నిర్వహించిన విద్యార్థుల వీకెండ్‌ పార్టీ కేసులో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏడుకు పెరిగిందని చేవెళ్ల సీఐ కట్టా నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. శంకర్‌పల్లి మండల పరిధిలోని ఓ కళాశాలకు చెందిన 108 మంది విద్యార్థులు ఎల్‌జీ ఫాంహౌస్‌లో వీకెండ్‌ పార్టీ నిర్వహించారు.


ఈ పార్టీని ఎస్‌వోటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా దాడి చేసి భగ్నం చేసిన విషయం తెలిసిందే. మొదటి రోజు 108 మంది విద్యార్థులకు పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించగా, అదే రోజున నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. సోమవారం మరో ముగ్గురు విద్యార్థులకు గంజాయి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఎల్‌జీ ఫాంహౌస్‌ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!

అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 07:04 AM