సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:45 AM
ఎటువంటి సందిగ్ధతకు తావు లేకుండా ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది.
నియామకాలు, పదోన్నతులు, అడ్మిషన్లపై అన్ని శాఖలకు సర్కారు మెమో జారీ
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎటువంటి సందిగ్ధతకు తావు లేకుండా ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. గతంలో సాంఘిక సంక్షేమశాఖ జారీ చేసిన ఆదేశాలను పునరుద్ఘాటించింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు జారీ చేసిన జీవోలు, మార్గదర్శకాలను ఎటువంటి మినహాయింపుల్లేకుండా అమలు చేయాలని అన్ని ప్రభుత్వశాఖలు, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లకు తాజాగా విడుదల చేసిన మెమోలో ఆదేశించింది. ఈ విషయమై కొన్ని శాఖల్లో స్పష్టత లోపిస్తున్నట్లు తన దృష్టికి రావడంతో తాజా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
తమ పరిధిలోని కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, యూనివర్సిటీలకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆయా ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. ఎస్సీ సంఘాలు, మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను తాజాగా పునరుద్ఘాటించింది. ఎస్సీ వర్గీకరణ నిబంధనల అమలులో తేడాలు, లోటుపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే తీవ్రంగా పరిగణిస్తామని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల మాదిగ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News