Share News

నేడు అతి భారీ వర్షాలు

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:32 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి, తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నేడు అతి భారీ వర్షాలు
Telangana Rain Alert

  • 2 జిల్లాలకు రెడ్‌, మూడింటికి ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

  • నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

  • సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి, తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.


నల్గొండ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ మెట్రోకు రూ.275 కోట్లు

ట్రూ-అప్‌ భారం ప్రజలపైనే..

కేయూ ప్రహరీ.. మళ్లీ మొదటికి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 04:32 AM