Share News

రేషన్‌ నిలుపుదలకు ఆదేశాలివ్వలేదు

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:27 AM

కొంత మంది రేషన్‌కార్డుకు మొబైల్‌ నంబరు అనుసంధానం చేయకపోవడం లేదా కుటుంబ సభ్యుల ఈకేవైసీ పూర్తి కాలేదనే కారణాలతో రేషన్‌ సరుకులు నిలిపివేసేలా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్పష్టం చేశారు.

రేషన్‌ నిలుపుదలకు ఆదేశాలివ్వలేదు

  • పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్పష్టత

అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొంత మంది రేషన్‌కార్డుకు మొబైల్‌ నంబరు అనుసంధానం చేయకపోవడం లేదా కుటుంబ సభ్యుల ఈకేవైసీ పూర్తి కాలేదనే కారణాలతో రేషన్‌ సరుకులు నిలిపివేసేలా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేశారు. రేషన్‌కార్డుకు మొబైల్‌ నంబరు అనుసంధానం కాలేదని, కుటుంబసభ్యుల ఈకేవైసీ పూర్తి కాలేదని కొందరు డీలర్లు సరుకులు నిలిపివేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. ఇప్పటి వరకు రేషన్‌కార్డులకు మొబైల్‌ నంబర్ల అనుసంధానం చేయని కుటుంబసభ్యుల నంబర్లను మాత్రమే సేకరించాలని ఆదేశాలిచ్చాం. మొబైల్‌ నంబరు అనుసంధానం, కుటుంబసభ్యుల ఈకేవైసీ పూర్తి చేయకపోయినా ఏ ఒక్క కార్డుదారునికీ రేషన్‌ నిరాకరించడం జరగదు. ఇలాంటి ఘటనలు జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలి’ అని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 07:27 AM