అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:00 AM
‘అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి..’ అంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు.
సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన వైఎస్ షర్మిల
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి..’ అంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంను ఆమె కలిశారు. వచ్చే నెల 5న నిర్వహించే అంజిలిరెడ్డి-రఘురామ్‌రెడ్డి వివాహ రిసెప్షన్‌కు రావాలని రేవంత్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కాగా, సీఎం రేవంత్‌ను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్, సీఈవో ఎస్‌జీ చలం కలిశారు. 23న సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News