పండగ వేళ.. సైబర్ బూచోళ్లు
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:47 AM
రోజుకో కొత్త రకం స్కీములతో సైబర్ కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి అడ్డంగా దోచేస్తున్నారు.
దీపావళి ఆఫర్లు, వోచర్స్ పేరుతో మోసానికి సిద్ధం
గిఫ్ట్‌ల పేరుతో సోషల్ మీడియాలో లింకులు
లింక్‌లు క్లిక్ చేయొద్దు, ఓటీపీలు చెప్పొద్దు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ: పండుగ వేళ బంపర్ ఆఫర్.. గిఫ్ట్ వోచర్స్.. నగదు రివార్డులు.. అంటూ దీపావళి ధమాకా పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా..? లింక్‌ను పంపించి, ఆ లింక్‌ను మరో పదిమందికి షేర్ చేసి డీటెయిల్స్ అప్‌డేట్ చేస్తే ఉచితరీచార్జ్ వస్తుందని చెప్తున్నారా..? అయితే అలాంటి మెసేజ్‌లను అస్సలు నమ్మొద్దని, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోసపూరిత లింకులు క్లిక్ చేసి, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడానికి సైబర్ క్రిమినల్స్ తెరతీశారని ప్రజలు, షాపింగ్ చేసిన కస్టమర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లింక్‌లను క్లిక్ చేసి సైబర్ నేరాల బారినపడొద్దని, ఓటీపీలు చొప్పొద్దని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆశకు పోతే.. మోసమే
రోజుకో కొత్త రకం స్కీములతో సైబర్ కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి అడ్డంగా దోచేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్‌లు ఇటీవల జోరుగా జరుగుతున్న నేపథ్యం లో దాన్ని అవకాశంగా తీసుకుంటున్న కేటుగాళ్లు సైబర్ మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు, శారీస్ భారీ డిస్కౌంట్ ధరలకే ఇస్తున్నట్లు ప్రకటనలు సోషల్‌మీడియాలో పెడుతున్నారు.
ఆ నకిలీ వెబ్‌సైట్ల లింక్‌లను క్లిక్ చేస్తున్న కస్టమర్లు డబ్బులు చెల్లించి సైబర్ మోసాల బారిన పడుతున్నారు. మరికొందరు క్రిమినల్స్.. ఏకంగా షాపింగ్ చేసిన కస్టమర్స్ డేటా సేకరించి మీరు చేసిన షాపింగ్‌కు కంపెనీ తరఫున గిఫ్ట్ వోచర్‌ను అందుకున్నారని లింకులు పెడుతున్నారు. లింకును క్లిక్ చేస్తున్న కస్టమర్స్.. అందులో వివరాలు నింపుతూ సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కుతున్నారు. అలా మనకు తెలియకుండానే మన వివరాలన్ని సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తాయని గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వీకెండ్ పార్టీ కేసులో.. 7కు చేరిన గంజాయి పాజిటివ్‌లు
అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News