Share News

రైతులు అంగీకరిస్తేనే చక్కెర ఫ్యాక్టరీలను తెరుస్తాం

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:23 AM

చెరకు రైతులు అంగీకరిస్తే చక్కెర ఫ్యాక్టరీలను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకునేందుకు ఫ్యాక్టరీ యజమానులు సిద్ధంగా లేరని కర్ణాటక ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌జార్కిహొళి అన్నారు

రైతులు అంగీకరిస్తేనే చక్కెర ఫ్యాక్టరీలను తెరుస్తాం
sathish

  • కేంద్రం ఎంఎస్పీ ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుంది

  • మంత్రి సతీశ్‌ జార్కిహొళి

బెంగళూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): చెరకు రైతులు అంగీకరిస్తే చక్కెర ఫ్యాక్టరీలను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకునేందుకు ఫ్యాక్టరీ యజమానులు సిద్ధంగా లేరని కర్ణాటక ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌జార్కిహొళి అన్నారు. బెళగావిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం గరిష్ఠ విక్రయ ధరను (ఎంఎస్‌పీ) పెంచితేనే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. తద్వారా చెరకు రైతులు, రైతుసంఘాల నేతలు, ఫ్యాక్టరీ యజమానుల డిమాండ్లకు ఒక పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర ఫ్యాక్టరీల యజమానులు ఫ్యాక్టరీలు తెరవాలనే ఆలోచనలో లేరని పేర్కొన్నారు. బుర్లాపురలో ఆందోళన సాగుతోందని, జిల్లా అధికారులు రైతులతో చర్చించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎస్‌ఏపీని ప్రకటించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి ఇటీవల చేసిన ప్రతిపాదనను ఆయన తిప్పికొట్టారు. కేంద్రప్రభుత్వం తొలుత చొరవ చూపాలని, టన్ను చెరకుకు రూ.3,500 చొప్పున చెల్లించేందుకు ఫ్యాక్టరీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ రైతులు రూ.4,500 డిమాండ్‌ చేస్తున్నారని, ఎవరికివారు పట్టుదలకు పోతే సమస్య పరిష్కారం కాదని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి

Updated Date - Nov 03 , 2026 | 07:27 AM