లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ABN , Publish Date - Nov 02 , 2026 | 07:09 PM
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంగోమ్‌చా బిమల్ అకోయ్‌జామ్ తొలగింపుపై ఢిల్లీ హైకోర్టు తాజాగా స్టే విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంగోమ్‌చా బిమల్ అకోయ్‌జామ్ తొలగింపుపై ఢిల్లీ హైకోర్టు తాజాగా స్టే విధించింది. తమపై లైంగిక వేధింపులకు దిగారంటూ ప్రొఫెసర్‌పై 11 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో యూనివర్సిటీ ఆయనను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
మీడియా కథనాల ప్రకారం, మే నెలలో విద్యార్థినులు ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేశారు. ఏదో ఒక కారణం చెప్పి తమను ప్రొఫెసర్ క్యాంపస్‌లోని తన నివాసానికి పిలిచేవారని చెప్పారు. ఆ తరువాత అసభ్య వ్యాఖ్యలతో వేధించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న జేఎన్‌యూ ఆయనను తొలగించింది. డిస్మిస్ ఆర్డర్‌పై వీసీ శాంతిశ్రీ డి. పండిట్ సంతకం చేశారు.
విద్యార్థినుల ఫిర్యాదులపై యూనివర్సిటీ అంతర్గత కమిటీ విచారణ జరిపినట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న విచారణ కమిటీ సూచన మేరకు ఆయనను తొలగిస్తున్నట్టు యూనివర్సిటీ తన ఆదేశాల్లో పేర్కొంది. అకోయ్‌జామ్ జేఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా చేశారు. ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
సర్ వ్యతిరేక ఆందోళనలు.. బాంబే హైకోర్టుకు ఇమ్రాన్ ఖాన్ బేషరతు క్షమాపణ
టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే విమానాల్లో వెళ్లొద్దు: సుప్రీం కోర్టు