Share News

సర్ వ్యతిరేక ఆందోళనలు.. బాంబే హైకోర్టుకు ఇమ్రాన్ ఖాన్ బేషరతు క్షమాపణ

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:34 PM

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్.. బాంబే హైకోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో అలాంటి ఆందోళనల్లో పాల్గొనబోనని ఆయన హామీ ఇచ్చారు.

సర్ వ్యతిరేక ఆందోళనలు.. బాంబే హైకోర్టుకు ఇమ్రాన్ ఖాన్ బేషరతు క్షమాపణ

ఇంటర్నెట్ డెస్క్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్.. బాంబే హైకోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో అలాంటి ఆందోళనల్లో పాల్గొనబోనని ఆయన హామీ ఇచ్చారు. గత నెల 10న ముంబైలో నిర్వహించిన సర్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ఇమ్రాన్‌కు ఇండియా వదిలివెళ్లాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఆ నోటీసులను ఆయన బాంబే హైకోర్టులో సవాలు చేశారు. ఆయన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. సర్ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు కోర్టు ఆయనను మందలించింది. ‘మీరు (ఇమ్రాన్ ఖాన్) అమెరికన్ సిటిజన్. మీ దగ్గర ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ఉంది. ఈ నేపథ్యంలో ఒక భారతీయ పౌరుడిగా రాజకీయ ప్రదర్శనల్లో మీరు పాల్గొనలేరు. ఆ హక్కు మీకు లేదు. భారతీయ పౌరుడు అమెరికాలో అలాంటి నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటే ఏంటి పరిస్థితి. మరుసటి రోజే ఆ పౌరుడిని ఇండియాకు తరలిస్తారు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.


ఇమ్రాన్ ఖాన్ ఆయన మొత్తం జీవితాన్ని భారత్‌లోనే గడిపారని, ఆయనకు అమెరికన్ పౌరసత్వం పుట్టుకతోనే వచ్చిందని ఆయన అడ్వొకేట్ వెంకటేశ్ ధోండ్ తెలిపారు. అయినా కూడా ఇమ్రాన్ అలాంటి ఆందోళనలో పాల్గొనలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఇమ్రాన్ తన జీవితం మొత్తం భారత్‌లోనే గడిపేస్తే, భారత పౌరసత్వం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. భారత పౌరసత్వం తీసుకోవాలని సూచించింది. ఎందుకంటే ఆయన మన దేశంలోనే బాలీవుడ్ స్టార్ అయ్యారని గుర్తుచేసింది. క్షమాపణ చెప్పినా హైకోర్టు ఆయనను తీవ్రంగా మందలించింది. భవిష్యత్తులో మళ్లీ అలాంటి రాజకీయ ఆందోళనలో పాల్గొనడానికి ఆ క్షమాపణను సాకుగా వాడుకోరాదని హైకోర్టు సూచించింది.


ఇవి కూడా చదవండి:

కివీస్ సిరీస్‌కు భువీని ఎంపిక చేయడమే సెలెక్టర్లు చేసిన తప్పు: ఇర్ఫాన్ పఠాన్

సంజునే నా ఫస్ట్ ఛాయిస్.. అభిమానికి అశ్విన్ అదిరిపోయే కౌంటర్!

Updated Date - Nov 02 , 2026 | 05:36 PM