జమ్మూకశ్మీర్ సీఎం వివాహం చెల్లదు.. ముస్లిం మతపెద్దల ప్రకటన
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:53 PM
గత శుక్రవారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో పెళ్లి జరిగింది. అయితే వీరి వివాహం చెల్లదంటూ ముస్లిం మతపెద్దలు ఈరోజు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో పెళ్లి జరిగిన మూడు రోజులకే ఓ మతపరమైన వివాదం రాజుకుంది. వీరి వివాహం ఇస్లామిక్ సూత్రాల ప్రకారం చట్టవిరుద్ధమని మత గురువు, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ (ఏఐఎమ్‌జే) జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ప్రకటించారు. షరియా చట్టం ప్రకారం ముస్లిం వివాహాల్లో వధూవరులిద్దరూ ఇస్లాం మతస్థులై ఉండాలని ఆయన తెలిపారు. అబ్దుల్లా ముస్లిం అయినప్పటికీ నిధి రజ్దాన్ అన్యమతస్థురాలని చెప్పారు. కాబట్టి షరియా చట్టం ప్రకారం ఈ వివాహం చెల్లదని పేర్కొన్నారు.
పెళ్లికి ముందే నిధి రజ్దాన్ ఇస్లాం మతంలోకి వచ్చి ఉండాల్సిందని ఏఐఎమ్‌జే అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. అప్పుడు వీరి వివాహం చెల్లుబాటు అయ్యేదని అన్నారు. కాగా శుక్రవారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌తో పెళ్లి జరిగింది. ఇది ‘జమ్మూ’ సీఎంకు రెండో వివాహం. తొలి భార్యతో ఆయనకు విడాకులు మంజూరు చేయడానికి కోర్టు ఇటీవలే అంగీకరించింది. దీంతో ఒమర్ అబ్దుల్లా రెండోసారి వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మతపరమైప వివాదం ఏర్పడింది.
ఈ వార్తలూ చదవండి
దియా మిర్జా వీడియోపై బీజేపీ అభ్యంతరం.. వీడియో డిలీట్
రామమందిరం విరాళాల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు