దియా మిర్జా వీడియోపై బీజేపీ అభ్యంతరం.. వీడియో డిలీట్
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:07 PM
దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చి కాలుష్యానికి కారణం కావద్దని బాలీవుడ్ నటి దియా మిర్జా చేసిన వీడియోను బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. ఆ వీడియోపై ముంబై బీజేపీ అధ్యక్షుడ అమీత్ సాతం తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో బీఎంసీ ఆ వీడియోను డిలీట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చి కాలుష్యానికి కారణం కావద్దని బాలీవుడ్ నటి దియా మిర్జా చేసిన వీడియోను బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. ఆ వీడియోపై ముంబై బీజేపీ అధ్యక్షుడ అమీత్ సాతం తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో బీఎంసీ ఆ వీడియోను డిలీట్ చేసింది. అయితే, ఇతర సెలబ్రిటీలు మాధురీ దీక్షిత్, అజింక్య రహానె, మరాఠీ యాక్టర్ నిషిగంధా వాద్ల వీడియోలు మాత్రం అలాగే ఉన్నాయి. హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో సెలబ్రిటీలతో చెప్పించాల్సిన అవసరం లేదని అమీత్ సాతం అన్నారు. ‘మన పండుగలు ఎలా జరుపుకోవాలో మనకు ఎవరూ పాఠాలు చెప్పక్కర్లేదు. మన సంప్రదాయాలు మన సంస్కృతిలో బాగా పెనవేసుకుని ఉన్నాయి’ అని సాతం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ తర్వాత ఆ వీడియోను బీఎంసీ తొలగించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చవద్దని అంతకుముందు దియా మీర్జా ఒక వీడియో చేశారు.
కాగా.. ముంబైలో కాలుష్యం పెరుగుతోందని, ముఖ్యంగా పండుగల సమయంలో ఇంకా తీవ్రం అవుతోందని, కాలుష్యం కట్టడిలో బీఎంసీ విఫలమైందని బాంబే హైకోర్టు అంతకుముందు బీఎంసీకి చీవాట్లు పెట్టింది. కాలుష్యం కట్టడికి సెలబ్రిటీలతో ప్రచారం చేయించాలని, కాలుష్యం తగ్గింపునకు వారితో అవగాహన కల్పించాలని సూచించింది. దీంతో హైకోర్టు సూచనను బీఎంసీ పాటించింది. బాణసంచా కాలిస్తే వెలువడే కాలుష్యంపై పలువురు సెలబ్రిటీలతో అవగాహన కల్పిస్తూ వీడియోలు చేయించింది. అలాగే పబ్లిక్ రోడ్లు, పార్కులు, బహిరంగ స్థలాల్లో బాణసంచా కాల్చడంపై బాంబే హైకోర్టు నిషేధం విధించింది.
ఇవీ చదవండి
LIVE : హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన