ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్.. అమిత్ షా విమర్శలు
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:47 PM
ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ కుదేలైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలని ఆ పార్టీ కంకణం కట్టుకుందని ఆయన విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ కుదేలైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలని ఆ పార్టీ కంకణం కట్టుకుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కుటిల ప్రయత్నాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే బీజేపీ మహా పాదయాత్ర చేస్తోందని చెప్పారు. ఈ మేరకు అమిత్ షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా ఈరోజు (సోమవారం) రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బీజేపీ 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' పేరిట మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొంనేందుకు కేంద్ర హోంమంత్రి నగరానికి వచ్చారు.
ఇవీ చదవండి
LIVE : హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన