Share News

నేడే అమిత్‌ షా పాదయాత్ర

ABN , Publish Date - Nov 02 , 2026 | 03:26 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.

నేడే అమిత్‌ షా పాదయాత్ర
Kishan Reddy, N Ramchander Rao

  • ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు

  • రాహుల్‌ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవు: ఈటల

హైదరాబాద్‌/జీడిమెట్ల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అరికట్టండి’ నినాదంతో బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్‌ వరకు ఈ పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. అమిత్‌ షాతోపాటు కేంద్ర మంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ తెలిపారు. పాదయాత్ర మార్గాన్ని, ఏర్పాట్లను రాంచందర్‌రావు, కిషన్‌రెడ్డి ఆదివారం రాత్రి పరిశీలించారు.


ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కాంగ్రెస్‌ విచిత్రమైన నాటకమాడుతోందన్నారు. భారతజాతి ఆత్మగౌరవాన్ని, కీర్తిని విదేశాల్లో పలచన చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలపైకాంగ్రెస్‌ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఆదివారం జీడిమెట్లలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సర్‌ ప్రక్రియ బీజేపీ మొదలుపెట్టింది కాదని, ఇప్పటివరకు 13సార్లు సర్‌ జరిగిందన్నారు. రాహుల్‌ గాంధీకి నాయకత్వం వహించే సత్తా లేదని, విదేశాల ఫండింగ్‌తో మీడియాను, సోషల్‌ మీడియాను మేనేజ్‌ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛినం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ రావణుడు.. మేం వానరసైన్యం!

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 03:26 AM