Share News

విద్యుత్‌ భారంతో మూతబడుతున్న పరిశ్రమలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:40 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏడు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ఏర్పాటుచేసిన టెక్స్‌టైల్‌ పార్క్‌ అలంకారప్రా యంగా మారింది.

విద్యుత్‌ భారంతో మూతబడుతున్న పరిశ్రమలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏడు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ఏర్పాటుచేసిన టెక్స్‌టైల్‌ పార్క్‌ అలంకారప్రా యంగా మారింది. కార్మికులకు ఆధునిక మరమ గ్గాలపై ఉపాధినందించే లక్ష్యంగా ఏర్పాటు చేసి న పార్కులో ఇప్పుడు మూతపడ్డ పరిశ్రమలు వెక్కిరిస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం రాజ న్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెన పల్లి వద్ద ఏర్పాటు అయిన టెక్స్‌టైల్‌ పార్క్‌లో పరిశ్రమలు మూతపడుతున్నాయి. పార్క్‌లోని మరముగ్గాల పరిశ్రమకు గతంలో అందించిన విద్యుత్‌ రాయితీ దూరం కాగా.. చార్జీలు భారం గా మారాయి. ఇందుకు ప్రధానంగా అనేక కార ణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం విద్యుత్‌ భారం ప్రధానంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుం టే విద్యుత్‌ భారం ఎక్కువ కావడం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు గిట్టు బాటుకాని పరిస్థితుల్లో పరిశ్రమలు మూతపడు తున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని మరమ గ్గాలకు 50శాతం విద్యుత్‌ రాయితీ సబ్సిడీ అనేక సంవత్సరాలుగా కొనసాగుతోంది. పట్టణంలోని మరమగ్గాలకు 50 శాతం విద్యుత్‌ రాయితీ నేరుగా వర్తింపచేస్తున్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో మాత్రం గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా బిల్లు చెల్లించి రీయింబర్స్‌మెంట్‌ పొందే విధంగా ఏర్పాటు చేశారు. రాయితీ కూడా సక్రమంగా రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడేవారు. 2015 నుంచి 2020 సంవత్సరం వరకు విద్యుత్తు రాయితీ కింద టెక్స్‌టైల్‌ పార్క్‌లో పరిశ్రమలకు రూ.14.66 కోట్లు పొందారు. ఆ తర్వాత రాయితీ పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం సిరిసిల్లకు విద్యుత్‌ రాయితీ 10 హెచ్‌పీల నుంచి 25 హెచ్‌పీలకు పెంచారు. ఇందులో భాగంగా పూర్తి 4 కేటగిరీ లో బిల్లింగ్‌ కావడంతో కేవలం సబ్సిడీ మినహా యిస్తే రెండు రూపాయలు మాత్రమే విద్యుత్‌ చార్జి పడుతుంది. టెక్స్‌టైల్‌ పార్క్‌లో 70నుంచి 80 హెచ్‌పీల వరకు పరిశ్రమలకు కరెంటు విని యోగిస్తారు. దీంతో ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల కింద ఉన్న పార్క్‌లో పరిశ్రమలకు ఇది వర్తించడం లేదు. పారిశ్రామికులు పూర్తి 4వ కేటగిరీలో 100 హెచ్‌పీల వరకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రా ల్లో టెక్స్‌టైల్‌ పరిశ్రమకు కరెంటు యూనిట్‌ చార్జి తక్కువగా ఉంది. సిరిసిల్లలో 7 రూపాయ ల వరకు ఉండడంతో పరిశ్రమలు నడవలేని పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వం వస్త్ర ఉత్ప త్తి ఆర్డర్లు కూడా అరకొరగానే ఇస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాల వస్త్ర పరిశ్రమతో పోటీ పడలేక పరిశ్రమలు మూతపడే పరిస్థితులు ఉన్నాయి.

ఉపాధి కరువు..

సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తి రంగంలో కార్మికులకు చేతినిండా పని కల్పించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ ఒడిదుడుకుల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. విద్యుత్‌ భారం, గిట్టుబాటు కానీ వస్త్ర ధర, ప్రభుత్వం నుంచి నామమాత్రంగా అందుతున్న ప్రోత్సాహంతో టెక్స్‌టైల్‌ పార్క్‌లో నిరంతరంగా 110 పరిశ్రమ ల్లో కొనసాగిన వస్త్ర ఉత్పత్తి నిలిచిపోతుంది. ప్రస్తుతం పార్కులు 35 నుంచి 40 పరిశ్రమలు మాత్రమే అరకొరగా కొనసాగుతున్నాయి. గతం లో 3వేల మంది కార్మికులకు ఉపాధి అందించిన టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఇప్పుడు 500 మందికి మించి కార్మికులు ఉపాధిని పొందలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పరిశ్రమలు స్థాపిం చిన పారిశ్రామికులు ఆధునిక మరమగ్గాలు సైతం అమ్మడంతోపాటు పరిశ్రమలను మూసివేశారు. మరికొందరు ఇతర రాష్ట్రాలకు తరలిం చారు. మూతపడిన పరిశ్రమల్లో ధాన్యం గోదాములుగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి.

వంద హెచ్‌పీల వరకు విద్యుత్‌ రాయితీ కల్పించాలి

- అన్నల్‌దాస్‌ అనిల్‌కుమార్‌, చైర్మన్‌ సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ క్లాత్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌

సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో పరిశ్రమల అభివృద్ధి, కార్మికులకు మెరు గైన ఉపాధి కల్పించే లక్ష్యంగా ఏర్పాటు చేసినా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ప్రధానంగా విద్యుత్‌ భారం ఎక్కువగా ఉంది. 2021 సంవత్సరం నుంచి విద్యుత్‌ రాయితీ రావడం లేదు. నాలుగో కేటగిరిలో 25 హెచ్‌పీల వరకు మాత్రమే బిల్లింగ్‌ జరుగుతుంది. దానిని 100 హెచ్‌పీల వరకు పెంచి రాయితీ కల్పించాలి. ప్రభుత్వ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు చేసుకోవడానికి 80శాతం సబ్సిడీ కల్పించాలి. పార్కులో ఎక్స్‌ పోర్ట్‌ క్వాలిటీ వస్త్రం తయారుచేయడానికి అవసరమైన కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌, ప్రీవీవింగ్‌, పోస్ట్‌వీవింగ్‌ లేకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో విద్యుత్‌ రాయితీ ఇస్తున్నట్లుగానే సిరిసిల్ల పార్క్‌ పరిశ్ర మలకు విద్యుత్‌ రాయితీ ఇస్తే పరిశ్రమ మనుగడలోకి వస్తుంది.

Updated Date - Nov 02 , 2026 | 12:40 AM