Share News

వేద విజ్ఞానమే భారతీయ సంస్కృతికి జీవనాడి

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:48 AM

భారతీయ నాగరికతకు వేదవిజ్ఞానమే మూలాధారమని.. భారతీయ సంస్కృతికి అది జీవనాడి అని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా అన్నారు.

వేద విజ్ఞానమే భారతీయ సంస్కృతికి జీవనాడి
Governor Shiv Pratap Shukla

  • యాదగిరిగుట్టలో 26వ వేద విద్వన్మహాసభల్లో రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా

యాదాద్రి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): భారతీయ నాగరికతకు వేదవిజ్ఞానమే మూలాధారమని.. భారతీయ సంస్కృతికి అది జీవనాడి అని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా అన్నారు. వేదాలు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదని, ప్రకృతి పరిరక్షణ, మానవ జీవన విధానం, నైతిక విలువలు, సామాజిక సామరస్యానికి దిశా నిర్దేశం చేసే సమగ్ర జ్ఞాన భాండాగారాలని ఆయన పేర్కొన్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త సౌజన్యంతో ఇక్కడ నిర్వహిస్తున్న 26వ వేద విద్వన్మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.


వేదజ్ఞాన సంపదను చెక్కుచెదరకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో వేదాలను అభ్యసిస్తూ, వేదపరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులను గవర్నర్‌ అభినందించారు. వేద విద్యపై యువత చూపుతున్న ఆసక్తి, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ఆశాజనక పరిణామంగా కొనియాడారు. కాగా.. గవర్నర్‌ దంపతులు లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, దేవాదాయశాఖ కమిషనర్‌ ఎం.హనుమంతరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె.భవానీశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 04:48 AM