Share News

బ్యాంకు మహిళా ఉద్యోగిపై తోటి ఉద్యోగి హత్యాయత్నం

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:33 AM

బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న అవివాహిత మహిళను అదే బ్యాంకులో పనిచేస్తున్న వివాహితుడైన ఉద్యోగి ప్రేమ పేరుతో వేధించాడు.

బ్యాంకు మహిళా ఉద్యోగిపై తోటి ఉద్యోగి హత్యాయత్నం
Vaira Bank Employee Attack

  • ప్రేమిస్తున్నానంటూ వేధింపులు

  • తిరస్కరించినందుకు కత్తితో దాడి..

  • మహిళకు గాయాలు.. వైరాలో ఘటన

వైరా, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న అవివాహిత మహిళను అదే బ్యాంకులో పనిచేస్తున్న వివాహితుడైన ఉద్యోగి ప్రేమ పేరుతో వేధించాడు. తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాహ్మణపల్లి అగ్రహారం శాఖలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వైరా ఎస్సై పుష్పాల రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పిల్లి ప్రదీప్‌(38) బ్రాహ్మణపల్లి అగ్రహారం శాఖ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి 15 ఏళ్ల క్రితమే వివాహమైంది.


కాగా, ఇదే బ్యాంకులో కొద్దినెలల క్రితం ఓ మహిళ(26) మరో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. అయితే ప్రదీప్‌ కొద్దిరోజుల క్రితం ఆ మహిళకు ప్రేమ ప్రతిపాదన చేశాడు. ఇందుకు ఆమె తిరస్కరించడంతో వేధించసాగాడు. ఈ క్రమంలోనే సెలవులో ఉన్న ప్రదీప్‌ శనివారం మధ్యాహ్నం సమయంలో బ్యాంకుకు వచ్చి.. కూరగాయలు కోసే కత్తితో మహిళా ఉద్యోగిపై ఒక్కసారిగా దాడి చేశాడు. కడుపులో పొడిచేందుకు ప్రయత్నించగా.. ఆమె అడ్డుకున్నారు. అతడు మళ్లీ దాడి చేయడంతో ఆమె చేతులు, వేళ్లు, చెంపకు, గొంతు వద్ద గాయాలయ్యాయి. దీనిని గమనించిన బ్రాంచ్‌ మేనేజర్‌, సిబ్బంది.. ప్రదీప్‌ను అడ్డుకొని ఆమెను రక్షించారు. బాధితురాలిని పక్కనే ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 05:33 AM