Share News

రాప్తాడు నిందితుడి హెల్త్ అప్‌డేట్.. కుడి కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్న వైద్యులు

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:54 PM

రాప్తాడు ఘటనలో పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి వివరాలు వెల్లడించారు.

రాప్తాడు నిందితుడి హెల్త్ అప్‌డేట్.. కుడి కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్న వైద్యులు
Rapthadu Case

అనంతపురం, నవంబర్ 2: రాప్తాడు ఘటనలో పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఉన్మాది హేమంత్ ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి వివరాలు వెల్లడించారు. నిందితుడు హేమంత్ కుడి కాలుకు తీవ్ర గాయం కావడంతో సగం కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్నారు. కుడి కాలుకు రక్త సరఫరా తగ్గిందని తెలిపారు. రక్త ప్రసరణ ఎందుకు తగ్గిందో ఆపరేషన్ థియేటర్లోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. రక్త సరఫరా బాగుంటేనే నరాలు, కండరాలు బాగుంటాయన్నారు. రక్త సరఫరా లేకుంటే కండరాలు చెడిపోతాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి వెల్లడించారు.


కాగా.. రాప్తాడు జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడి అనంతరం నిందితుడు హేమంత్ పరారవగా.. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. నిందితుడిని పట్టుకునేందుకు 15 బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు ఆత్మకూరు అటవీ ప్రాంతంలోనిందితుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే హేమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులపై నిందితుడు రాళ్లతో దాడికి తెగబడ్డాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి రెండు కాళ్లల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను పోలీసులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి...

‘రాప్తాడు బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోంది’.. ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్

వైసీపీలో మనోవేదనకు గురయ్యా.. ఏపీలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ పెడతా: విజయసాయి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 02:14 PM