Share News

రాప్తాడు దాడిలో స్నేహితురాలి సాహసం.. లక్ష్మి ధైర్యానికి మంత్రి లోకేశ్ ప్రశంసలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:54 AM

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటనలో స్నేహితురాలు లక్ష్మి సాహసాన్ని మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. దుండగుడిని చూసి పారిపోకుండా బాధితురాలిని రక్షించేందుకు లక్ష్మి ప్రయత్నం చేసిందన్నారు.

రాప్తాడు దాడిలో స్నేహితురాలి సాహసం.. లక్ష్మి ధైర్యానికి మంత్రి లోకేశ్ ప్రశంసలు
Minister Nara Lokesh

అమరావతి, నవంబర్ 2: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో దాడి చేసిన ఘటన సంచలనం రేపంది. ఈ ఘటనలో బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే బాలికపై సదరు వ్యక్తి దాడి చేస్తున్న సమయంలో ఆమె స్నేహితురాలు లక్ష్మి ఎంతో ధైర్యంతో అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో బాలిక కూడా గాయాలపాలై చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో లక్ష్మి ధైర్య సాహసాలపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాధితురాలిపై దాడి సమయంలో స్నేహితురాలు లక్ష్మి ధైర్యానికి మంత్రి ప్రశంసలు కురిపించారు. దుండగుడిని చూసి పారిపోకుండా బాధితురాలిని రక్షించేందుకు లక్ష్మి ప్రయత్నం చేసిందన్నారు. ఆ రెండు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.


మంత్రి లోకేశ్ పోస్ట్..

‘భయంకరమైన రాప్తాడు దాడిలో బాధితురాలు త్వరగా కోరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రార్థిస్తున్న సమయంలో ఆమె స్నేహితురాలు లక్ష్మి ధైర్య సాహసాల గురించి మనం చెప్పుకోవాలి. ఓ దుండగుడు చెయిన్‌సాతో (కర్రలు కోసే యంత్రం) పాఠశాలలోకి ప్రవేశించినప్పుడు.. బాధితురాలిని రక్షించేందుకు మరో చిన్నారి లక్ష్మి ప్రయత్నించింది. స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన లక్ష్మి సాహసం అభినందనీయం. భయపడి పారిపోకుండా స్నేహితురాలికి అడ్డుగా నిలబడిన లక్ష్మి నిజమైన స్నేహానికి నిదర్శనం. తాను తీవ్రంగా గాయపడినా బాధితురాలిని స్నేహితురాలు కాపాడింది. నేడు ఇద్దరు అమ్మాయిలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో స్నేహం, ధైర్యం అంటే ఏంటో మనకు గుర్తుచేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులకు అత్యుత్తమ వైద్యం అందిస్తాం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. రాష్ట్రంలో తరగతి గదిలో విద్యార్థులు భయపడే పరిస్థితి రాకుండా పాఠశాలల్లో భద్రత పటిష్ఠం. చిన్నారులు త్వరగా కోలుకుని మళ్లీ చిరునవ్వులతో బడికి రావాలని కోరుకుంటున్నా’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

మురసు తుఫాన్‌పై సర్కార్ హైఅలర్ట్.. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అనిత ఆదేశం

రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 12:49 PM