Share News

మురసు తుఫాన్‌పై అప్రమత్తతో వ్యవహరించాలి.. అధికారులకు పవన్ ఆదేశాలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 10:17 AM

‘మురసు’ తుఫాన్ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మురసు తుఫాన్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు.

మురసు తుఫాన్‌పై అప్రమత్తతో వ్యవహరించాలి.. అధికారులకు పవన్ ఆదేశాలు
Pawan Kalyan

అమరావతి, నవంబర్ 2: ‘మురసు’ తుఫాన్ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మురసు తుఫాన్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.


వాగులు, వంకల చెంత జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచించారు. తాగు నీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలు.. ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలు పాటిస్తూ, యంత్రాంగానికి సహకరించాలన్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని పవన్ కల్యాణ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

పులివెందులలో గొడవల సృష్టికి గొడ్డలి పార్టీ యత్నం

ఎర్రన్నాయుడు ఆశయాలే నా మార్గం.. ప్రజాసేవే నా లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 10:52 AM