హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో ఐదేళ్ల కుమారుడిని చంపిన తండ్రి
ABN , Publish Date - Nov 02 , 2026 | 09:59 AM
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తండ్రి విద్యాసాగర్.. ఐదేళ్ల కుమారుడి గొంతు నులిమి హత్య చేశాడు. బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శిల్పినగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.
హైదరాబాద్, నవంబర్ 2: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకునే హత్య చేశాడో కసాయి తండ్రి. బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శిల్పినగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. తండ్రి విద్యాసాగర్.. ఐదేళ్ల బాలుడి గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. బోరబండలో జీవిస్తున్న విద్యాసాగర్, దుర్గ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్తుండగా.. విద్యాసాగర్ మద్యానికి బానిసగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత రాత్రి కూడా విద్యాసాగర్ ఫుల్‌గా మద్యం సేవించి.. తన ఐదేళ్ల కొడుకు గొంతునులిమి దారుణానికి పాల్పడ్డాడు.
ఆ సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్లినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా కుమారుడు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. విషయం తెలిసిన స్థానికులు వెంటనే బోరబండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు విద్యాసాగర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
పులివెందులలో గొడవల సృష్టికి గొడ్డలి పార్టీ యత్నం
ఎర్రన్నాయుడు ఆశయాలే నా మార్గం.. ప్రజాసేవే నా లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest AP News And Telugu News