Share News

అటు పెళ్లి.. ఇటు బాధ్యత!

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:29 AM

పెళ్లి.. జీవితానికి తొలిమెట్టు.. ఓటు.. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు! ప్రతి ఒక్కరి జీవితంలో రెండూ ముఖ్యమే!..

అటు పెళ్లి.. ఇటు బాధ్యత!
varudu

పెళ్లి.. జీవితానికి తొలిమెట్టు.. ఓటు.. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు! ప్రతి ఒక్కరి జీవితంలో రెండూ ముఖ్యమే!.. నెల్లూరు, మార్కాపురంలలో వేర్వేరు నూతన జంటలు పెళ్లి అయిన వెంటనే తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుని అందరినీ ఆకర్శించారు. నెల్లూరుకు చెందిన నిహారికకు, కర్ణాటకకు చెందిన హర్షవర్ధన్‌లకు ఆదివారం ఉదయం నెల్లూరులో వివాహమైంది. నిహారిక ఉంటున్న ప్రాంతం 2వ డివిజన్‌ పరిధిలో ఉండటంతో.. సాయంత్రం 4.30 గంటలకు పెళ్లిబట్టలతోనే పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని తన ఓటు వేసింది. నూతన వధువు పెళ్లి అలంకరణతో పోలింగ్‌ కేంద్రానికి రావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. మార్కాపురం కరెంటు ఆఫీసు వెనుక నివసించేగన్నవరం అశోక్‌ వివాహం ఆదివారం ఉదయం 10.50 గంటలకు మార్కాపురంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగింది. ఆయనకు కూడా సాయంత్రం 4 గంటలకు 11వ వార్డులోని పోలింగ్‌ కేంద్రానికి కుటుంబ సభ్యులతో వెళ్లి మున్సిపల్‌ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

- నెల్లూరు రూరల్‌, మార్కాపురం వన్‌టౌన్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 02 , 2026 | 06:48 AM