Share News

రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళి

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:16 AM

విజయవాడలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళి
CM Chandrababu Naidu

విజయవాడ, నవంబర్ 2: నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి సీఎం నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం చాలా బాధాకరమన్నారు. రిటైర్ అయిన రెండు నెలలకే ఆయన చనిపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


chandbabau.jpg

బాలసుబ్రహ్మణ్యం క్యాన్సర్ బారిన పడి యుద్ధమే చేశారని.. చికిత్స తీసుకుంటూనే విధులకు హాజరయ్యారని సీఎం తెలిపారు. ‘నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేవారు.. నాకు ఆయనతో సుదీర్ఘ అనుభవం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో చాలా మదనపడ్డారు. ఆ సమయంలో మేము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మాకు‌ సూచనలు ఇచ్చేవారు. ఆర్టీసీ ఎండీగా కోరిన వెంటనే పోస్టింగ్ ఇచ్చాను’ అని తెలిపారు.


chandbabau-1.jpg

మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో బాలసుబ్రహ్మణ్యం కీలకంగా పని చేశారని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ అంటే చాలా ఆసక్తి అని, రవాణా శాఖ‌ కమిషనర్‌గా విప్లవాత్మక ‌మార్పులు తెచ్చారని తెలిపారు. నీతి నిజాయితీతో ఏ శాఖలో అయినా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. రిటైర్ అయిన తరువాత ఆయన అడిగిన సాయం కూడా చేసినట్లు తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి‌కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

chandbabau-2.jpg


ఇవి కూడా చదవండి...

మురసు తుఫాన్‌పై అప్రమత్తతో వ్యవహరించాలి.. అధికారులకు పవన్ ఆదేశాలు

మురసు తుఫాన్‌పై సర్కార్ హైఅలర్ట్.. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అనిత ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 12:10 PM