‘రాప్తాడు బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోంది’.. ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:32 PM
రాప్తాడు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అనంతపురం, నవంబర్ 2: రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, ఈ వార్త తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పుకొచ్చారు. బాలిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
లోకేశ్ పోస్ట్..
‘ఈ రోజు ఉదయాన్నే బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు.. ఎంతో సంతోషాన్ని కలిగించే వార్త చెప్పారు. అందించారు. రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. వైద్యుల సూచనలను అర్థం చేసుకుని స్పందిస్తోంది. బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వార్త నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇది నాకే కాదు, ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఊరటనిచ్చే శుభవార్త. బాలిక త్వరగా పూర్తిగా కోలుకుని, చిరునవ్వులతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
రాప్తాడు జెడ్పీ హైస్కూల్ పునఃప్రారంభం.. తగ్గిన హాజరుశాతం
టెన్త్ విద్యార్థినిపై దాడి ఘటన అనంతరం దాదాపు రెండు రోజుల తర్వాత రాప్తాడు జిల్లా పరిషత్ హైస్కూల్ పునః ప్రారంభమైంది. హైస్కూల్లో దాదాపు 350 మందికిపైగా విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. అయితే పదవ తరగతి విద్యార్థినిపై దాడి ఘటన నేపథ్యంలో పాఠశాలకు విద్యార్థుల హాజరుశాతం తగ్గింది. 350 మందికి పైగా విద్యార్థుల్లో కేవలం 10 మంది విద్యార్థినీ విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, తల్లిదండ్రుల్లో భరోసా నింపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో 20 కౌన్సిలింగ్ బృందాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు .. విద్యార్థినీ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇతర వ్యక్తుల నుంచి ఏదైనా ప్రమాదం నుంచి కాపాడుకోవడంపై విద్యార్థుల్లో సెల్ఫ్ డిఫెన్స్‌పైనా అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
ఇవి కూడా చదవండి...
రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళి
రాప్తాడు దాడిలో స్నేహితురాలి సాహసం.. లక్ష్మి ధైర్యానికి మంత్రి లోకేశ్ ప్రశంసలు
Read Latest AP News And Telugu News