మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ ఎండీ
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:10 PM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తీవ్ర తుఫాన్‌గా మారిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
అమరావతి, నవంబర్ 02: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తీవ్ర తుఫాన్‌గా మారిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 22 కిమీ వేగంతో ఈ తుఫాన్ కదులుతుందని అన్నారు. సోమవారం అర్థరాత్రి తర్వాత నెల్లూరు - నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో ఈ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పారు.
ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం నెల్లూరుకు 160 కిమీ, చెన్నైకి 180 కిమీ, కావలికు 180 కిమీ, ఒంగోలుకు 210 కిమీ, మచిలీపట్నానికి 240 కిమీ దూరంలో మురసు తుఫాన్ కేంద్రీకృతమైందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
పలు విమాన సర్వీసులు రద్దు..
మరో వైపు ఈ తుఫాన్ కారణంగా.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. వైజాగ్, హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసుల రాకపోకలు నిలిపివేశారు.