రామమందిరం విరాళాల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:15 PM
అయోధ్య రామమందిరం విరాళాల కేసులో దాఖలైన పిటిషన్ల విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 02: అయోధ్య రామమందిరం విరాళాల కేసులో దాఖలైన పిటిషన్ల విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు వెలువరించింది.
విరాళాల చోరీ కేసు ట్రయల్‌లో స్థానిక కోర్టుకు సాయపడేందుకు రిట్ పిటిషనర్లకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కేవలం నిందితుడికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సాధారణ కేసు కాదని పేర్కొంది. ఇందులో కొంత ప్రజా ప్రయోజన అంశం కూడా ఇమిడి ఉందని తెలిపింది. అందువల్ల కోర్టుకు సహకరించేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నామని పిటిషనర్లకు ధర్మాసనం వివరించింది.
జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. విరాళాల కేసులో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక మేజిస్ట్రేట్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. రామమందిరం నిర్మించే స్థలంపై సరిహద్దుల పునః పరిశీలన కోరుతూ దాఖలైన నూతన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత నౌకాదళానికి 8 అత్యాధునిక యుద్ధనౌకలు.. రూ.53,866 కోట్లతో ఒప్పందం
పంజాబ్‌లో ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు!
For More National News And Telugu News