భారత నౌకాదళానికి 8 అత్యాధునిక యుద్ధనౌకలు.. రూ.53,866 కోట్లతో ఒప్పందం
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:18 PM
భారత నౌకాదళాన్ని పటిష్ఠం చేస్తూ.. రూ. 53,866.50 కోట్ల వ్యయంతో 8 అత్యాధునిక ‘నెక్స్ట్ జనరేషన్ కార్వెట్’ యుద్ధనౌకల తయారీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజు ఢిల్లీలో అధికారికంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత నౌకా దళాన్ని పటిష్ఠం చేసే విధంగా కొత్తతరం యుద్ధ నౌకల తయారీకి రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వివరాల్లోకి వెళితే..
ఈ ఒప్పందంలో భాగంగా.. జీఆర్‌ఎస్‌ఈకి (GRSE) 5 కార్వెట్‌లు.. గోవా షిప్‌యార్డ్‌కు (GSL) 3 యుద్ధనౌకల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా షిప్‌యార్డుల్లో 72 లక్షలు, ఎంఎస్ఎంఈలలో 4.6 కోట్ల మేరకు ఉపాధి లభిస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. ఈ 8 కార్వెట్లను.. ఆకాశం, సముద్ర ఉపరితలం, నీటి అడుగున.. ఒకేసారి దాడి చేసే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపుదించనున్నట్లు వెల్లడించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా స్వదేశీ డిజైన్, టెక్నాలజీతో యుద్ధనౌకల నిర్మాణం చేపట్టనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఏపీకి మురసు తుఫాన్ ముప్పు.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!
భయమా.. అది నా డిక్షనరీలోనే లేదు: గంభీర్