ఢిల్లీలో కఠినంగా కాలుష్య నియంత్రణ చర్యలు.. ఒక్కరోజే రూ.60 లక్షల జరిమానాలు
ABN , Publish Date - Nov 02 , 2026 | 04:16 PM
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాల యజమానులకు భారీగా జరిమానాలు విధించారు. వింటర్ యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం రూ.68.4 లక్షల జరిమానా వేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాల యజమానులకు భారీగా జరిమానాలు విధించారు. వింటర్ యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం రూ.68.4 లక్షల జరిమానా వేశారు. ఆరోజు దాదాపు 15 వేల వాహనాలను తనిఖీ చేశారు. 1539 వాహనాలను బార్డర్ పాయింట్ల తిప్పి పంపారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పీయూసీసీ) ఉల్లంఘనల కింద 566 చలానాలు జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. పీయూసీసీ ఉల్లంఘనలకు రూ.56.6 లక్షలు, సరిహద్దుల వద్ద ఆంక్షల ఉల్లంఘనలకు రూ.2 లక్షలు, నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు రూ.9.8 లక్షల మేర జరిమానా వేశారు. ఆదివారం 14,930 వాహనాలను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. వాటిలో 1400 వెహికల్స్ను వెనక్కి పంపారు. 62 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వెనక్కి పంపిన వాహనాల్లో 140 తేలికపాటివి కాగా, 54 లైట్ కమర్షియల్ వెహికల్స్, 95 హెవీ గూడ్స్ వెహికల్స్, 34 బస్సులు ఉన్నాయి. అలాగే 1423 టూ వీలర్లు, త్రీ వీలర్లను చెక్ చేసి 789 వాహనాలను వెనక్కి పంపారు. వాటిలో 38 వెహికల్స్ సీజ్ చేశారు.
కాగా.. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యవసర సర్వీసుల కోసం ఉపయోగించే వాహనాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాంటివి మొత్తం 740 వెహికల్స్ను తనిఖీ చేసి అనుమతించారు. అలాగే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకుండా వెహికల్స్ నడుపుతున్న యజమానులకు అధికారులు 566 చలానాలు జారీ చేశారు. రూ.56.6 లక్షల జరిమానా కూడా విధించారు. వాటిలో ఢిల్లీ పోలీసులు వేసిన చలాన్లు 493, జరిమానాలు రూ.49.3 లక్షలు ఉండగా, రవాణా శాఖ అధికారులు వేసిన చలాన్లు 73, జరిమానాలు రూ. 7.3 లక్షలు ఉన్నాయి. ఇక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన యజమానులకు పర్యావరణ పరిహారం కింద రూ.9.8 లక్షల ఫైన్ వేశారు. వింటర్ యాక్షన్ ప్లాన్ ఆంక్షలు ఈనెల 1 నుంచి వచ్చే ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటాయి. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు వింటర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
ఇవీ చదవండి
LIVE : హైదరాబాద్లో అమిత్ షా పర్యటన