Share News

సంజునే నా ఫస్ట్ ఛాయిస్.. అభిమానికి అశ్విన్ అదిరిపోయే కౌంటర్!

ABN , Publish Date - Nov 02 , 2026 | 10:19 AM

గతంలో సంజుకు మద్దతుగా నిలిచిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సిరీస్ మొత్తం సంజు విఫలమయ్యాడంటూ వెక్కిరిస్తూ పోస్ట్‌లు పెట్టారు.

సంజునే నా ఫస్ట్ ఛాయిస్.. అభిమానికి అశ్విన్ అదిరిపోయే కౌంటర్!
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను తప్పించి యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలంటూ కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజు ఆశించిన స్థాయిలో రాణించలేదు. గతంలో సంజుకు మద్దతుగా నిలిచిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సిరీస్ మొత్తం సంజు విఫలమయ్యాడంటూ వెక్కిరిస్తూ పోస్ట్‌లు పెట్టారు. దీనికి అశ్విన్ కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఈ ఫ్యాన్స్ వర్సెస్ అశ్విన్ వార్ నెట్టింట వైరల్‌గా మారింది.


న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20లో సంజు 10 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఓ అభిమాని అశ్విన్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘మీ ఫస్ట్ ఛాయిస్ సంజు సిరీస్ మొత్తం ఫెయిలయ్యాడు. దీనికి ఏమంటారు?’ అని ప్రశ్నించాడు. ‘మీరెప్పుడు అతడి గురించే ఆలోచిస్తుంటారు.. సంజు మీకు అబ్సెషన్‌లా మారాడు’ అనే అర్థం వచ్చేలా అశ్విన్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అయితే అశ్విన్‌ సమాధానంతో వివాదం అక్కడితో ఆగలేదు. కొందరు అభిమానులు మరోసారి స్పందిస్తూ.. సంజుకు మద్దతు ఇవ్వడం పేరుతో ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శించారు. దేశం తరఫున ఆడే జట్టులో ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీనే తమ ఫస్ట్‌ ఛాయిస్‌ అంటూ అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి:

ఏపీకి మురసు తుఫాన్ ముప్పు.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

భయమా.. అది నా డిక్షనరీలోనే లేదు: గంభీర్

Updated Date - Nov 02 , 2026 | 10:20 AM