Share News

హై హై.. సింధు, లక్ష్య

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:59 AM

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మళ్లీ మునుపటి జోరు అందుకుంది..అలాగే యువ ఆటగాడు లక్ష్యసేన్‌ కూడా తిరిగి గాడిన పడ్డాడు..ఈ ఇద్దరు...

హై హై.. సింధు, లక్ష్య

హైలో ఓపెన్‌ టైటిళ్లు కైవసం

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మళ్లీ మునుపటి జోరు అందుకుంది..అలాగే యువ ఆటగాడు లక్ష్యసేన్‌ కూడా తిరిగి గాడిన పడ్డాడు..ఈ ఇద్దరు హైలో ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌చాంపియన్లుగా నిలిచారు.. ఈ సీజన్‌లో సింధుకిది రెండో టైటిల్‌ కాగా.. లక్ష్యసేన్‌కు మొదటి ట్రోఫీ కావడం విశేషం..

సార్‌బ్రూకెన్‌ (జర్మనీ): హైలో ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో పీవీ సింధు, లక్ష్యసేన్‌ భళా అనిపించారు. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో విజేతలుగా నిలిచి డబుల్‌ ధమాకా సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 21-12, 21-14తో వరుస గేముల్లో ప్రపంచ 25వ ర్యాంకర్‌ లినె హాజ్‌మార్క్‌ జేర్‌ఫెల్‌ (డెన్మార్క్‌)ను చిత్తు చేసింది. ఏడో సీడ్‌ లక్ష్యసేన్‌ కూడా వరుస గేముల్లో 21-17, 21-10తో నాలుగో సీడ్‌ జొనాధన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)కి షాకిచ్చాడు. ప్రపంచ మాజీ చాంపియన్‌ సింధు గత జూలైలో జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక..గతవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆమె రన్నర్‌పగా నిలిచింది. హైలో ఓపెన్‌ టైటిల్‌ దరిమిలా.. 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు సాధించిన వరల్డ్‌ నెం.8 సింధు.. సీజన్‌ చివరి టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు క్వాలిఫై అవకాశాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఇక, 25 ఏళ్ల లక్ష్యసేన్‌ తన చివరి టైటిల్‌ను గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో గెలిచాడు. ఈ ఏడాది ఆలింగ్లండ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ

ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..

5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్

Updated Date - Nov 02 , 2026 | 04:59 AM