Share News

5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:17 PM

తనకు జాబ్ రాకపోవడానికి ఓ టెకీ చెప్పిన కారణం నెట్టింట వైరల్‌గా మారింది. టెకీ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్
Job interview rejection,

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్వ్యూల్లో విఫలం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిల్లో చాలా మటుకు అందరికీ తెలిసినవే. కానీ తనకు జాబ్ రాకపోవడానికి ఓ టెకీ చెప్పిన కారణం విని జనాలు షాకైపోతున్నారు. దీంతో, ఆయన నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. నకుల్ అనే వ్యక్తి ఈ పోస్టును షేర్ చేశారు. ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పేముందు ఐదు సెకన్ల పాటు ఆలోచించడమే తన కొంప ముంచిందని సదరు టెకీ చెప్పుకొచ్చారు.

‘ఇంటర్వ్యూ అయిపోయిన తరువాత కొన్ని రోజులకు కంపెనీ నుంచి ఈమెయిల్ వచ్చింది. మొదట వాళ్లు నాకు ధన్యవాదాలు చెప్పారు. ఇంటర్వ్యూ కోసం నేను పడ్డ శ్రమను గుర్తించామన్నారు. ఆ తరువాత నాకు జాబ్ ఎందుకు ఇవ్వలేదో చెప్పుకొచ్చారు’


‘ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పేముందు నేను 5 సెకన్ల పాటు ఆగడం వారు గమనించారట. సమాధానం చెప్పే ముందు ఆ మాత్రం ఎవరైనా ఆలోచిస్తారు కదా. కానీ ఇలా మాటమాటకీ ఆగుతుంటే నా సామార్థ్యాలను అంచనా వేయడంలో వాళ్లు ఇబ్బంది పడ్డారట. నన్ను సరిగా అంచనా వేయలేకపోయారట. అందుకే నా అప్లికేషన్‌ను ఇక పరిశీలించబోమని చెప్పారు’ అని ఆ టెకీ చెప్పుకొచ్చారు.

ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాట్‌జీపీటీ కూడా ఐదు సెకన్ల పాటు ఆగి సమాధానం ఇస్తున్నప్పుడు మనుషులకు ఆ మాత్రం సమయం ఇవ్వకపోతే ఎలా? అని అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి కారణం చెబుతూ ఈమెయిల్ పంపడం కనీవినీ ఎరుగనిదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ పోస్టు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

టైటానిక్‌ ఆకారంలో ఇల్లు కట్టిన రైతు.. 13 ఏళ్ల పాటు శ్రమించి..

కో అంటే కోటీశ్వరులే...

Updated Date - Nov 01 , 2026 | 03:30 PM