కో అంటే కోటీశ్వరులే...
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:37 AM
ఆ గ్రామంలోకి అడుగుపెట్టగానే... ఆశ్చర్యం సందర్శకుల ముఖంపై వెలిగిపోతుంది. సకల సదుపాయాల విల్లాలు, లగ్జరీ కార్లు, కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్... ఇవన్నీ అక్కడ సాధారణం.
ఆ గ్రామంలోకి అడుగుపెట్టగానే... ఆశ్చర్యం సందర్శకుల ముఖంపై వెలిగిపోతుంది. సకల సదుపాయాల విల్లాలు, లగ్జరీ కార్లు, కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్... ఇవన్నీ అక్కడ సాధారణం. చైనాలోని హుయాక్సీ గ్రామంలో కనిపించే దృశ్యమిది. ఊరిలో అందరూ కోటీశ్వరులే. ప్రపంచంలోనే ధనిక గ్రామంగా గుర్తింపు పొందిన గ్రామ విశేషాలివి...
అదొక గ్రామం... అయితే ఆశ్చర్యంగా గ్రామస్తులందరూ అందమైన విల్లాల్లో నివసిస్తారు. లగ్జరీ కార్లలో తిరుగుతారు. వైద్యసదుపాయాలు ఉచితంగా లభిస్తాయి. ఇంటింటికీ వంట నూనె ఉచితంగా సరఫరా అవుతుంది. చైనాలోని హుయాక్సీ గ్రామం... ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా గుర్తింపు పొందింది.

సామూహిక వ్యాపారం...
హుయాక్సీ ఒక సోషలిస్టు గ్రామం. 1961లో స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి వూ రెన్‌బావో ఈ గ్రామ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వ్యవసాయం జీవనాధారంగా ఉన్న ఈ గ్రామాన్ని అత్యంత సంపన్న సమాజంగా మార్చాలనే దూరదృష్టి ఆయనకు ఉండేది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలివిగా అనుసరించడం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఆ తరువాత ఉక్కు కర్మా గారాలు, రవాణా, సరుకు రవాణా సంస్థలు, వస్త్ర పరిశ్రమలు వంటి రంగాల్లోకి విస్తరిం చారు. ఈ పరిశ్రమల్లో గ్రామస్థులందరికీ వాటా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే గ్రామస్థులందరూ సామూహిక వ్యాపారం చేశారు. పరిశ్రమల నిర్వహణ కోసం 1994లో గ్రామస్థులందరూ కలిసి హుయాక్సీ గ్రూప్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కెమికల్స్, టెక్స్‌టైల్స్, స్టీల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, షిప్ బిల్డింగ్ వంటి పరిశ్రమలు అనేకం అక్కడ ఉన్నాయి. 2013లో వూ రెన్ బావో చనిపోవడంతో ఆయన కుమారుడు వూ గ్జియోన్ పార్టీ సెక్రటరీ, విలేజ్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.

కోట్ల ఆదాయం
ఈ గ్రామంలో నెలకొల్పిన కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో నమోదై... అతి పెద్ద కార్పోరేట్ సంస్థలుగా ఎదిగాయి. ఈ కంపెనీల్లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రతీ ఒక్క గ్రామస్థునికి లాభాల్లో వాటా అందు తుంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పాటు చైనాలోని అనేక ప్రాంతాలు... ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ గ్రామం మాత్రం ఆర్థికాభివృద్ధితో దూసుకెళ్లింది. బోనస్‌లు, పెన్షన్లు, జీతాలు అన్నీ కలిపి లెక్కిస్తే, ఒక్కో కుటుంబానికి ఏడాదికి సగటున కోటి రూపాయలపైన ఆదాయం ఉంటుంది. పని, సంపద అనేవే ఇక్కడి ప్రధాన సిద్ధాంతాలు. ఎవరూ వారాంతపు సెలవులు తీసుకోరు. ఎప్పుడూ పనుల్లో నిమగ్నమై ఉంటారు. లాభాలను ఇతర పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగిస్తుంటారు.
అతి పెద్ద భవనం
హుయాక్సీ గ్రామం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతి ఎత్తైన హోటల్‌ను నిర్మించారు. లాంగ్సి ఇంటర్నేషనల్ హోటల్ పేరుతో నిర్మించిన ఈ ఆకాశహర్మ్యం 328 మీటర్ల ఎత్తు (74 అంతస్తులు) ఉంటుంది. ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్, న్యూయార్క్‌లోని క్రిస్లర్ భవనం కన్నా ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఎవరితోనైనా పోటీ పడ గల సామర్థ్యం హుయాక్సీ ప్రజలకు ఉందని నిరూపించడానికే ఈ నిర్మాణం చేశామని వూ రెన్‌బావో ఒక సందర్భంలో చెప్పారు. అందులోని 60వ అంతస్తులో బంగారు ఆవుబొమ్మను ఏర్పాటు చేశారు. భవనం పైభాగంలో భారీ బంగారు గోళం ఉంటుంది. ఈ హోటల్‌లో 800 సూట్లు ఉన్నాయి. రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, రూఫ్‌టాప్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ హాల్స్ వంటి సదుపాయాలున్నాయి. ఆభరణాలతో అలంకరించిన షాండ్లియర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రతీ ఏడాది కొన్ని లక్షల మంది పర్యాటకులు ఈ గ్రామ వైభవాన్ని చూడటా నికి వెళ్తుంటారు. గ్రామ ప్రజల వైభవాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News