నిద్ర... ఆరోగ్య ముద్ర!
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:01 AM
నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి కోసమే కాదు... మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, రోగనిరోధక వ్యవస్థ, హార్మోన్ల సమతుల్యతకు కూడా అవసరమే. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, రోజూ నిద్ర సమయాలు మారుతూ ఉంటే సమస్యల్లో పడతారు.
నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి కోసమే కాదు... మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, రోగనిరోధక వ్యవస్థ, హార్మోన్ల సమతుల్యతకు కూడా అవసరమే. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, రోజూ నిద్ర సమయాలు మారుతూ ఉంటే సమస్యల్లో పడతారు. తగినంతగా నిద్ర లేకపోతే శరీరం కొన్ని సంకేతాలను వెల్లడిస్తుంది. అవేమిటంటే..
చర్మం నిస్తేజంగా మారడం, పొడిబారడం, ముడతలు ముందుగానే కనిపించడం వంటివి నిద్ర నాణ్యతకు సంబంధించిన అంశాలు. నిద్రపోయే సమయంలో చర్మం తనను తాను రిపేర్ చేసుకుంటుంది.
నిద్రకు అంతరాయాల వల్ల శరీరంలో వాపు సంబంధిత ప్రక్రియలు ప్రభావితం అవుతాయి. జుట్టు రాలడానికి దారి తీయొచ్చు. అయితే జుట్టు రాలడానికి పోషకా హార లోపాలు, హార్మోన్ల మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతాయి.
నిద్ర సరిగా లేకపోతే చిరాకు, ఆందోళన, చిన్న విషయాలకే కోపం రావడం, అసహనం, భావోద్వేగాల నియం త్రణ కోల్పోవచ్చు. నిద్ర తగ్గితే ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామ ర్థ్యం దెబ్బతింటుంది.
నిద్ర తగ్గితే... ఆకలిని నియంత్రించే ప్రక్రియలు ప్రభావితమవుతాయి. అధికంగా తినాలనే కోరిక కలుగవచ్చు. కొందరిలో తీపి లేదా అధిక క్యాలరీల ఆహారం తినాలనే కోరిక పెరగొచ్చు.

నిద్ర సరిపోకపోతే... రోజంతా నిద్రమత్తుగా ఉండడం ఒక సాధారణ సంకేతం. పని లేదా చదువుపై దృష్టి
పెట్టడం కష్టమవుతుంది. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టొచ్చు.
తగినంత నిద్ర లేకపోతే పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. నిద్ర మెదడు సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి సాయపడు తుంది. నిద్రలేమి వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
నిద్ర సరిపోకపోతే కొందరికి మైగ్రేన్ ప్రేరేపితం అవుతుంది. చురుకుదనం, కోలుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది.
నిద్ర సమయాలు శరీరం గ్లూకోజ్‌ను వినియోగించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలికంగా నిద్రలో అంతరాయాలు...
టైప్ 2 మధుమేహంతో ముడిపడి ఉండొచ్చు.
ఆలస్యంగా నిద్రపోవడం, నిద్రలేమి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. చిరాకు, ఆందోళన, నిరుత్సాహం పెరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News