Share News

ఇది ఆస్ట్రేలియా జట్టు ఆడే క్రికెట్ కాదు.. డేవిడ్ వార్నర్ ఫైర్

ABN , Publish Date - Nov 01 , 2026 | 09:17 AM

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపై ఆ జట్టు మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. 100 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినప్పటికీ.. చివరకు మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోవడంపై అసహనం వ్యక్తం చేశాడు.

ఇది ఆస్ట్రేలియా జట్టు ఆడే క్రికెట్ కాదు.. డేవిడ్ వార్నర్ ఫైర్
David Warner

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపై ఆ జట్టు మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. 100 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినప్పటికీ.. చివరకు మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు కనీస పోరాటం కూడా చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. కమిన్స్ సారథ్యంలోని జట్టు ప్రదర్శనను సిగ్గుచేటు అంటూ ఘాటుగా విమర్శించాడు.


‘చాలా దారుణం. ఇది ఆస్ట్రేలియా జట్టు ఆడే క్రికెట్ కాదు. అసలు ఎలాంటి పోరాట పటిమ కనిపించలేదు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ సిరీస్ మొత్తం బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. తొలి టెస్టులో మాథ్యూ రెన్‌షా కొంత పోరాటం చూపించాడు. కానీ మొత్తంగా చూస్తే బ్యాటర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఓ చెత్త షాట్‌కు ప్రయత్నించి రెన్‌షా గోల్డెన్ డక్ అయ్యాడు. ఇలాంటి బంతులను ఎదుర్కొనే విషయంలో ఆటగాళ్లు తమ ఆటతీరును మార్చుకోవాలి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని వార్నర్ ఫైర్ అయ్యాడు. వ్యాఖ్యానించాడు.


డబ్ల్యూటీసీ పట్టికలోనూ..

దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ ఓటమితో ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఆ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు వరుస విజయాలతో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. ఒకప్పుడు టెస్టు క్రికెట్‌లో అత్యంత నిలకడైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియా.. కీలక మ్యాచ్‌లో కనీస పోరాటం చూపించకపోవడంపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న రోహిత్ శర్మ.. ఎప్పుడంటే?

వైభవ్‌ను ఆడించాలనే ఉద్దేశం లేకపోతే స్వదేశానికి పంపించండి: ఆకాశ్ చోప్రా

Updated Date - Nov 01 , 2026 | 09:18 AM