విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న రోహిత్ శర్మ.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Nov 01 , 2026 | 08:10 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి దేశవాళీ క్రికెట్‌లో సందడి చేయనున్నాడు. త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడేందుకు హిట్‌మ్యాన్ సిద్ధమవుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి దేశవాళీ క్రికెట్‌లో సందడి చేయనున్నాడు. త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడేందుకు హిట్‌మ్యాన్ సిద్ధమవుతున్నాడు. డిసెంబర్‌లో జరిగే ఈ దేశవాళీ వన్డే టోర్నీలో పాల్గొంటానని ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడేలా బీసీసీఐ ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే.
నవంబర్ 4 నుంచి భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత శ్రీలంకతో డిసెంబర్ 13 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. అది ముగిసిన తర్వాత రోహిత్ ముంబై జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ డిసెంబర్ 14 నుంచి 29 వరకు జరగనుండటంతో.. టోర్నీలో చివరి దశ గ్రూప్ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జనవరి 2 నుంచి 8 వరకు నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే రోహిత్ శర్మ ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!