మనోళ్లదే కూత
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:56 AM
సంప్రదాయ క్రీడ కబడ్డీలో మనోళ్లు మరోసారి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. టోర్నీ ఏదైనా సరే కూత పెట్టడంలో...
పురుషులు, మహిళల టైటిళ్లు కైవసం
కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్
అహ్మదాబాద్: సంప్రదాయ క్రీడ కబడ్డీలో మనోళ్లు మరోసారి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. టోర్నీ ఏదైనా సరే కూత పెట్టడంలో తమకు సాటి లేదని నిరూపిస్తూ.. కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షి్‌పలో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచారు. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్ 35-15 స్కోరు తేడాతో ఉగాండను చిత్తుగా ఓడించి ట్రోఫీ అందుకుంది. భారత జట్టులో సాక్షి.. రైడింగ్‌లో పది పాయింట్లు స్కోరు చేసి విజయంలో కీలకపాత్ర పోషించింది. అను ఆరు, కెప్టెన్ నిధి శర్మ ఐదు పాయింట్లు కొల్లగొట్టారు. పురుషుల తుది పోరులో భారత బృందం 54-20 స్కోరుతో శ్రీలంకపై విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!