Share News

టైటానిక్‌ ఆకారంలో ఇల్లు కట్టిన రైతు.. 13 ఏళ్ల పాటు శ్రమించి..

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:24 PM

ల కంటే సరిపోదు... దాన్ని నిజం చేసుకునే పట్టుదల కూడా ఉండాలి. సముద్రంలో ప్రయాణించే టైటానిక్‌ను అచ్చంగా ఇంటి రూపంలో తీసుకురావాలని కల కన్నాడో రైతు.

టైటానిక్‌ ఆకారంలో ఇల్లు కట్టిన రైతు.. 13 ఏళ్ల పాటు శ్రమించి..
Titanic Shaped House

కల కంటే సరిపోదు... దాన్ని నిజం చేసుకునే పట్టుదల కూడా ఉండాలి. సముద్రంలో ప్రయాణించే టైటానిక్‌ను అచ్చంగా ఇంటి రూపంలో తీసుకురావాలని కల కన్నాడో రైతు. ఆయన తన కల నిజం చేసుకోవడానికి 13 ఏళ్లు పట్టింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో టైటానిక్‌ నౌక ఆకారంలో ఇంటిని నిర్మించుకున్నాడు మింటు రాయ్‌. ఈ ఇంటిని జహాబ్‌ బరి అంటే... ఓడ ఇల్లు అని స్థానికులు పిలుస్తారు. ఇంటి ఆకృతిని టైటానిక్‌ నౌకను పోలి ఉండేలా రూపొందించాడు. ఓడ ముందు భాగం డెక్‌ను పోలిన అంతస్తు, గుండ్రటి కిటికీల తరహా నిర్మాణాలు దీని ప్రత్యేకతలు. ఈ కలల గృహాన్ని నిర్మించేందుకు సరైన సాయం దొరకకపోవడంతో మింటురాయ్‌ నేపాల్‌కి వెళ్లి... నిర్మాణ పనుల్లో నైపుణ్యం నేర్చుకున్నాడు.


ఆ తర్వాత తనే స్వయంగా ఇంటి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాడు. వ్యవసాయం, ఆటో నడపడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ ఇంటిని పూర్తి చేశాడు. ఓడ డెక్‌ను పోలిన పై భాగంలో టీ షాప్‌ లేదా చిన్న రెస్టారెంట్‌ ప్రారంభించి సంద ర్శకులను ఆకర్షించడం ద్వారా... కుటుంబానికి అదనపు ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నాడు మింటు రాయ్‌. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన కలను వదులుకోని మింటు రాయ్‌ మొత్తానికి ఘటికుడే!


ఈ వార్తలు కూడా చదవండి:

బీట్‌రూటు మారుతోంది!

అడవిలో కార్పొరేట్ పాఠాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 01:43 PM