Share News

జగన్ చేస్తోంది రోడ్ షో కాదు... ఫ్యాక్షన్ షో: కూటమి పార్టీ నేతలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:38 PM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆ సమయంలో పులివెందులలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్డు షోపై కూటమిలోని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ చేస్తోంది రోడ్ షో కాదు... ఫ్యాక్షన్ షో: కూటమి పార్టీ నేతలు
YCP Chief YS Jagan

కడప, నవంబర్ 01: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆ సమయంలో పులివెందులలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్డు షోపై కూటమిలోని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేస్తోంది రోడ్ షో కాదు... ఫ్యాక్షన్ షో అంటూ వారు మండిపడ్డారు. ఇది నిబంధనలకు విరుద్దమని వారు స్పష్టం చేశారు. దీనిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. విధ్వంసం సృష్టిస్తానంటూ ముందుగానే జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవాలని ఎస్ఈసీ‌కి కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు.


మరోవైపు వైఎస్ జగన్ చేరుకోకముందే పులివెందులలో వైసీపీ హైడ్రామా సృష్టించింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హెలికాప్టర్‌లో పులివెందులకు ఆయన చేరుకున్నారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారంటూ పులివెందులలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ముందస్తుగా వైసీపీ స్కెచ్ వేసిందని తెలుస్తుంది. దీంతో వైఎస్ జగన్ రెడ్డి ల్యాండైనప్పటి నుంచి పులివెందులలో హై డ్రామా చోటు చేసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ రాజకీయ సమాధికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధం: ఎమ్మెల్యే ఆదినారాయణ

రాప్తాడులో గాయపడిన విద్యార్థినికి శస్త్రచికిత్సలు విజయవంతం: నారా లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 01:19 PM