Share News

నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:02 PM

నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో ఉత్తర భారతంలో రైలు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ కారిడార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం

ఇంటర్నెట్ డెస్క్: నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో ఉత్తర భారతంలో రైలు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ కారిడార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వారణాసి, న్యూఢిల్లీ మధ్య వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్‌కు వారణాసిలో వైష్ణవ్ పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్తర భారతంలో హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌తో నగరాలు మరింత దగ్గరవుతాయని ఆయన అన్నారు. అంతేకాకుండా ఢిల్లీ నుంచి ఆగ్రాకు కేవలం 59 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చని తెలిపారు. నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌తో చాలా మంది జీవితాలు మారిపోతాయన్నారు. యువత, మధ్యఆదాయం ఉన్నవారు, చేతివ‌ృత్తుల వారి జీవితాలు మారిపోతాయని మంత్రి పేర్కొన్నారు.


మేకిన్ ఇండియాపై ఫోకస్

నార్తర్న్ ఇండియా బుల్లెట్ ట్రెయిన్ కారిడార్ ప్రాజెక్టులో మేకిన్ ఇండియాపై ఫోకస్ పెట్టామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పిల్లర్ల నుంచి ఇనుప దూలాల వరకు అన్నీ దేశంలో తయారైన వాటినే ఆ ప్రాజెక్టులో వాడతామని ఆయన చెప్పారు. అంతేకాకుండా లోకల్ ఇంజినీరింగ్, స్థానిక కార్మికులతోనే ఆ కారిడార్ నిర్మిస్తామన్నారు. ఈ కారిడార్‌తో మేజర్ హబ్‌లను కలపడంతో పాటు ఢిల్లీ-లక్నో మధ్య ప్రయాణి సమయం కూడా తగ్గుతుందన్నారు. అంతేకాకుండా కనెక్టివిటీని వారణాసి, తూర్పు ప్రాంతాల వరకు విస్తరిస్తామని వెల్లడించారు.


ఈ నగరాల మధ్య తగ్గే ప్రయాణ సమయం

నార్తర్న్ ఇండియా బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌తో ఢిల్లీ-కాన్పూర్ మధ్య 1 గంట 45 నిమిషాలు, ఢిల్లీ-ఆగ్రా మధ్య 59 నిమిషాలు, ఢిల్లీ-లక్నో మధ్య 2 గంటల 12 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అలాగే లక్నో నుంచి వారణాసికి 1 గంట 21 నిమిషాలు, వారణాసి నుంచి ఢిల్లీకి 3 గంటల 35 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు.


ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 01:12 PM