Share News

ఓట్ బచావ్ ర్యాలీకి తెలంగాణ నుంచి 7 వేల మంది కాంగ్రెస్ నేతలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 10:02 AM

ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ ర్యాలీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ చోరీ జరిగిందన్న ఆరోపణలతో ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

ఓట్ బచావ్ ర్యాలీకి తెలంగాణ నుంచి 7 వేల మంది కాంగ్రెస్ నేతలు

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ ర్యాలీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ చోరీ జరిగిందన్న ఆరోపణలతో ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి 7 వేల మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. విమానాలు, రైళ్లు, బస్సులు , కార్లలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు. 77 బస్సులు, 600 కార్లలో వారు ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ నుంచి రామ్ లీలా మైదాన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.


కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. సీఈసీకి రక్షణ కల్పిస్తున్న 2023 చట్టాన్ని రద్దు చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓటరు సవరణ జాబితాకు సంబంధించిన సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని కోరుతున్నారు. దేశంలో అన్ని ఎన్నికలను బ్యాలట్ పేపర్లతోనే నిర్వహించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 01 , 2026 | 10:24 AM