Share News

తెలుగు రాష్ట్రాల పోలీసులకు దక్షత పతకాలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:15 AM

విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ, ధైర్యసాహసాలు ప్రదర్శించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక కేంద్ర గృహ మంత్రి దక్షత పతకాలకు ఎంపికయ్యారు.

తెలుగు రాష్ట్రాల పోలీసులకు దక్షత పతకాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ, ధైర్యసాహసాలు ప్రదర్శించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక కేంద్ర గృహ మంత్రి దక్షత పతకాలకు ఎంపికయ్యారు. శనివారం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా 2026 సంవత్సరానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు సంస్థలకు చెందిన 490 మంది సిబ్బందికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్ర గృహ మంత్రి దక్షత పతకాలను ప్రకటించింది.

నేర దర్యాప్తు విభాగంలో ఏపీ నుంచి ఇన్‌స్పెక్టర్లు ఎస్‌కే నఫీజ్‌ బాషా, జస్వంత్‌ జయ నాయక్‌, కొరివి వెంకటరమణ, ఎస్సై యెలుకూరి నాగమధును ఎంపిక చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఐపీఎస్‌లుగా విధులు నిర్వహిస్తున్న తెలుగు అధికారులు ఎంసీవీ మహేశ్వర్‌రెడ్డి, వి.శివప్రసాద్‌ గంజాల, కుమార్‌ చింతా, సింగారెడ్డి రుషికేశ్‌రెడ్డి, స్పెషల్‌ ఆపరేషన్‌ విభాగంలో సీఆర్‌ఫీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కె.శ్రీనివాసరెడ్డికి పతకాలు లభించాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 05:15 AM