ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

ABN, Publish Date - Oct 31 , 2026 | 09:41 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి నవంబర్ 2 లేదా 3వ తేదీ నాటికి మధ్య కోస్తాంధ్రలోని మచిలీపట్నం - బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 1 నుంచి మధ్య కోస్తాంధ్రలో..

ఐఎండీ (IMD), ఇతర వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి నవంబర్ 2 లేదా 3వ తేదీ నాటికి మధ్య కోస్తాంధ్రలోని మచిలీపట్నం - బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 1 నుంచి మధ్య కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Updated at - Oct 31 , 2026 | 09:41 PM